జియో ప్రైమ్ ఆఫర్ గడువు.. మరో నెల పొడిగింపు?

ముంబై : ఈ నెలాఖరుతో ముగియనున్న రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్ గడువును మరో నెలపాటు పొడిగించే అవకాశాలున్నాయి. అంటే మార్చి 31 గడువు కాస్తా ఏప్రిల్ 30 వరకు పొడిగించవచ్చని టెలీ ఎనాలిసిస్ కథనం పేర్కొంది. అయితే కంపెనీ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. రిలయన్స్ జియో ప్రస్తుత వినియోగదారులతోపాటు ఈనెలాఖరు వరకు సంస్థ నెట్‌వర్క్‌లో చేరేవారు రూ.99 చెల్లించడం ద్వారా ప్రైమ్ ఆఫర్‌లో చేరేందుకు వీలుంటుంది. తద్వారా ప్రస్తుతం ఉచితంగా పొందుతున్న సర్వీసులను డిస్కౌంట్ రేటులో పొందేందుకు వీలుంటుంది. జియో ప్రైమ్ ఆఫర్‌లో చేరిన వారు నెలకు రూ.303 చెల్లించడం ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొందేందుకు వీలుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు రోజుకు ఒక జీబీ డాటా 4జీ వేగంతో పొందవచ్చు. ఆ తర్వాత వేగం 128 కేపీబీఎస్‌కు పడిపోతుంది. దేశీయంగా కాలింగ్ మాత్రం పూర్తి ఉచితం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*