స్కూలు బరువుల నుండి విముక్తి కల్పించండి

12-years-old-boy-to-go-on-an-indefinite-hunger-strike-from-october-2

ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాలుడు నిరాహార దీక్షకు కూర్చోబోతున్నాడు. తన లాంటి ఎంతో మంది పిల్లల కష్టం తీర్చడానికి తానీ పని చేస్తున్నానని చెప్పాడు. ఆ కష్టమేంటో తెలుసా? స్కూల్ బ్యాగు బరువు మోయడం. స్కూల్ బ్యాగు బరువు ఎంతుండాలి అన్న విషయంపై నియమాలు ఉన్నాయి. కానీ వాటిని ఏ స్కూలూ పాటించడం లేదు. విద్యార్థి బరువులో స్కూల్ బ్యాగు బరువు పది శాతానికి మించకూడదు. ప్రస్తుతం బ్యాగు బరువుకు విద్యార్థుల శరీరం కూడా ముందుకి వంగిపోతోంది. దీనిపై తన యుద్ధాన్ని ప్రకటించాడు 12 ఏళ్ల రుగ్వేద్ రాయిక్వర్. ఉండేది ముంబై దగ్గర చంద్రపూర్‌లో. విద్యానికేతన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు.ఓసారి మెడికల్ క్యాంపుకు హాజరయ్యాడు రుగ్వేద్. అక్కడి వైద్యుడు పిల్లలు వయసుకు తగ్గట్టు పెరగడం లేదని, స్కూలు బ్యాగుల బరువు వల్లే ఎత్తు తగ్గుతోందని చెప్పాడు. ఆ మాటలు రుగ్వేద్‌లో ఆలోచనను రేపాయి. పోరాటం చేసి స్కూల్ బ్యాగు బరువులు తగ్గేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఉత్తరం రాశాడు. ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన స్నేహితుడితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు. అయినా కూడా ప్రభుత్వం చలించలేదు. చివరికి నిరాహార దీక్ష చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. నాగ్‌పూర్‌లోని సన్విధాన్ చౌక్ ను దీక్షా వేదికగా ఎంచుకున్నాడు. పోలీసులు మాత్రం అనుమతి లేదని చెబుతున్నారు. అక్టోబర్ 2 నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. రుగ్వేద్ పోరాటానికి అతని స్కూల్ వాళ్లు చలించారు. విద్యార్థులందరికీ పుస్తకాలు మోసుకునే అవసరం లేకుండా స్కూల్లోనే ర్యాక్స్ ఏర్పాటు చేశారు. రుగ్వేద్ మాత్రం తమలాగే రాష్ట్రంలో ఉన్న అందరు పిల్లలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*