ఆదుకున్న రోహిత్, సాహా: కివీస్ టార్గెట్ 376

2nd-test-day-4-kolkata-india-set-new-zealand-376-run-targe

ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ 376 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌కు నిర్దేశించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వృద్ధిమాన్‌ సాహా 58 నాటౌట్‌ (120 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకం బాదడంతో ఓవర్‌నైట్‌ స్కోరు 227/8తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 263 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్‌ కుమార్‌ (23), షమీ (1) చివర్లో సాహాకు చక్కని సహకారం అందించారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. కాగా, రోహిత్ శర్మ కూడా 132 బంతుల్లో 82 పరుగులు చేసి భారత్‌ మంచి స్కోరు చేసేలా సహకారం అందించాడు.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 316
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 204
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 263

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*