చెల్లెలి ప్రేమ వివాహం షాక్ తో అన్నయ్య ఆత్మహత్య

a-brother-shocked-after-hearing-his-sister-love-marriage

తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో.. కుటుంబ భారమంతా అతడి మీదే పడింది. పాతికేళ్లకే అటు కుటుంబ భారాన్ని, ఇటు చెల్లెలి పెళ్లిని తన భుజాల మీదికెత్తుకున్నాడు. ఇదే క్రమంలో చెల్లి కోసం ఓ మంచి సంబంధం కూడా చూశాడు. ఈ నెల 20న నిశ్చతార్థం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో గత ఆదివారం ఇంట్లోంచి వెళ్లిపోయిన అతని చెల్లి.. మరొకరిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. తూప్రాన్ కు చెందిన శ్రావణ్(25) అనే వ్యక్తి స్థానికంగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో.. కుటుంబానికి తానే పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లిని చేయాలని ఓ మంచి సంబంధం కూడా చూశాడు. ఈ నెల 20న నిశ్చాతార్థం ఖరారు కాగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశాడు. ఇదిలా ఉండగా.. గత ఆదివారం నాడు శ్రావణ్ కుమార్ చెల్లెలు ఇంట్లోంచి వెళ్లిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం పోలీసులు ఆశ్రయించడంతో.. పోలీసులు శ్రావణ్ ను పిలిపించి నచ్చజెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణ్ సోమవారం ఉదయం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*