బ‌య‌ట‌ప‌డిన 706 క్యారెట్ల డైమండ్‌

సియెరా లియోన్‌లోని ఓ పాస్ట‌ర్ 706 క్యారెట్ల డైమండ్‌ను వెలికితీశారు. ఇది డైమండ్ల చ‌రిత్ర‌లో బ‌య‌ట‌ప‌డిన ప‌దో అతిపెద్ద స్టోన్‌గా గుర్తించారు. అన‌ధికార త‌వ్వ‌కాల్లో భాగంగా ఎమాన్యేల్ మోమోకి ఈ డైమండ్ దొరికింది. ప్ర‌భుత్వ అనుమ‌తితో సొంతంగా త‌వ్వ‌కాలు జ‌రిపే మోమోకే.. ఈ డైమండ్ అమ్మ‌కం హ‌క్కులు ద‌క్కుతాయి. నాలుగు శాతం మాత్రం ప్ర‌భుత్వానికి వెళ్తుంది. మ‌రికొంత ఆదాయ ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్ర‌భుత్వ వాటా కింద వ‌చ్చే సొమ్ముతో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని మైన్స్ మినిస్ట‌ర్ మిన్‌కైలు మ‌న్సారే తెలిపారు. ఈ డైమండ్‌ను మొద‌ట ఆ పాస్ట‌ర్ దేశ‌ అధ్య‌క్షుడు ఎర్నెస్ట్ బై కొరోమాకు అంద‌జేశారు. ఆ త‌ర్వాత దానిని ఫ్రీటౌన్ సెంట్ర‌ల్ బ్యాంక్ లాక‌ర్‌లో దాచి ఉంచారు. ఇది వివాద ర‌హిత డైమండ్స్‌ను గుర్తించే కింబ‌ర్లీ ప్ర‌క్రియ కింది ఉంది. ఇందులోనే దాని విలువ‌ను కూడా నిర్ధారిస్తారు.

ఆ త‌ర్వాత ఈ డైమండ్‌ను బిడ్డింగ్‌లో ఉంచి అమ్మ‌కానికి పెడ‌తారని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ డైమండ్ క్వాలిటీ గుర్తించిన త‌ర్వాత ఇది ప‌ది నుంచి ప‌దిహేనో ర్యాంకులో నిలుస్తుంద‌ని అమెరికాకు చెందిన డైమండ్ ఎక్స్‌ప‌ర్ట్ పాల్ జిమ్నిస్కీ తెలిపారు. అత్యాధునిక మెషిన్లు వాడ‌కుండా కేవ‌లం చిన్న‌చిన్న వ‌స్తువులు, చేతుల‌తో త‌వ్వ‌కాలు జ‌రిపే అక్క‌డి వ్య‌క్తులు ఇలాంటి డైమండ్ గుర్తించ‌డం అనూహ్య‌మే. సియెరా లియోన్ బ‌య‌ట అమ్మితే దీనికి మరింత విలువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జిమ్నిస్కీ అభిప్రాయ‌ప‌డ్డారు. డైమండ్ క్వాలిటీ, రంగు తెలియ‌కుండా దాని విలువ క‌ట్ట‌డం అసాధ్యం. అయితే ఇంత‌కుముందు 726 క్యారెట్ల పాలిష్డ్ డైమండ్ ఈ ఏడాది మేలో అమ్మ‌కానికి వ‌స్తున్న‌ది. ఇందులో 25 క్యారెట్ల ముక్క‌ను 22 ల‌క్ష‌ల నుంచి 36 ల‌క్ష‌ల డాల‌ర్ల (రూ.14.41 కోట్ల నుంచి 23.5 కోట్లు)కు అమ్ముడుపోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఒక్కో క్యారెట్‌ రూ.57 ల‌క్ష‌ల నుంచి రూ.94 ల‌క్ష‌లు ప‌లుక‌నుంద‌ని జిమ్నిస్కీ చెప్పారు. ఈ లెక్క‌న తాజాగా బ‌య‌ట‌ప‌డిన 706 క్యారెట్ల డైమండ్‌.. ఆ పాస్ట‌ర్‌పై కాసుల వ‌ర్షం కురిపించ‌నుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*