ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ పథకాలకు ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని సుప్రీంకోర్టు ఇవాళ స్ప‌ష్టంచేసింది. అయితే బ్యాంక్ ఖాతాలు తెర‌వ‌డంలాంటి వాటికి మాత్రం ఆధార్‌ను వాడుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆధార్‌ను స‌వాలు చేస్తూ దాఖ‌ల‌య్యే పిటిష‌న్ల విచార‌ణ‌కు ఏడుగురు జ‌డ్జిల ధ‌ర్మాస‌నం ఏర్పాటుచేయాల్సిన అవ‌స‌రం ఉన్నా.. ఇప్ప‌ట్లో అది సాధ్యం కాద‌ని కోర్టు చెప్పింది. 30కిపైగా ఉన్న కేంద్ర సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి పొందాలంటే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ సంఖ్య‌ను ఇవ్వాల్సి ఉంటుందని ఈ మ‌ధ్యే కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌ధ్యాహ్న భోజ‌నం, స్కాల‌ర్‌షిప్స్‌లాంటి ప‌థ‌కాల కోసం కూడా ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. అయితే సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్‌కు లింకు పెట్టొద్ద‌న్న త‌న గ‌త తీర్పునే సుప్రీంకోర్టు మ‌రోసారి వెలువ‌రించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*