ఆధార్ అనుసంధానం అక్కర్లేదు

ప్రస్తుతానికైతే ఎవరూ ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆధార్ చట్టబద్ధత ఏంటో తేలే వరకూ ఆధార్‌ను అనుసంధానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే సామాజిక సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు పేర్కొంది. వాస్తవానికి ఆధార్‌ను బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లకు అనుసంధానించడం కోసం తుది గడువును గతంలో సుప్రీం కోర్టు మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో ఆ అనుసంధాన తేదీ మరిన్ని రోజులు పొడిగించినట్టయింది. అయితే, ఫలానా తేదీ వరకంటూ సుప్రీం చెప్పలేదు. ఆధార్ చట్టం న్యాయబద్ధతను తాము సమీక్షించి తీర్పు చెప్పేవరకూ ఆధార్‌ను అనుసంధానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆధార్ అనుసంధానిస్తే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదముందని, తద్వారా ఓ వ్యక్తి గోప్యతా హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌నే విచారించిన సుప్రీం కోర్టు ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*