కత్తిపోట్లతోనే ఇంటికి పరిగెట్టాడు

after-stabbed-man-ran-1-5-km-to-get-back-home

ఓ వ్యక్తి అర్థరాత్రి దొంగల చేతిలో కత్తి పోటుకు గురయ్యాడు. అనంతరం రక్తమోడుతూనే ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాడు. ఇప్పుడతని పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల ప్రకారం… 40 ఏళ్ల తులసీరామ్ బెంగళూరులోని ఆస్టిన్ టౌన్ లో ఉంటున్నాడు. అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకని ఆదివారం ఇంటికి వస్తున్నాడు. రాత్రి కావడంతో అతనొచ్చే దారిలో ఎవరూ లేరు. ఇంతలో బండి మీద ఇద్దరు యువకులు వచ్చారు. అతడిని చిరునామా అడిగి వెళ్లారు. వంద మీటర్లు ముందుకెళ్లాక ఆగిపోయారు. తులసీరామ్ దగ్గరికి వెళ్లి డబ్బు, విలువైన వస్తువులు ఇచ్చేయమని అడిగారు. అతను లేవని చెప్పినా వినలేదు. కత్తితో పొడిచి… జేబులో ఉన్న పదిహేనువందల రూపాయలు తీసుకుని పారిపోయారు. కత్తిపోటుతో కొన్ని నిమిషాల పాటూ తులసీరామ్ కు స్పృహ కోల్పోయాడు. అనంతరం తనకు స్పృహ రావడంతో… గాయం దగ్గర చేయి అడ్డుపెట్టుకుని ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి పరిగెట్టాడు. తలుపు కొట్టి ద్వారం దగ్గరే పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కత్తి లోతుగా దిగడం, అక్కడ ఇన్ఫెక్షన్ కావడంతో పరిస్థితి విషమించినట్టు వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటూ అతని పరిస్థితి అంచనా వేయలేమని చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలు కూడా లేకపోవడంతో కేసును ఛేదించడం కష్టమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*