అగ్రిగోల్డ్‌ నిందితులకు బెయిల్‌

అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురికి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కృష్ణాజిల్లా ప్రధాన న్యాయ మూర్తి వై.లక్ష్మణరావు మంగళవారం బెయిల్‌ మంజూరుచేశారు.  అవ్వా వెంకటరామారావు, అవ్వా హేమసుందరవరప్రసాద్‌, అవ్వా వెంకటశేష నాగేంద్రరావు, అవ్వా సత్యవెంకటేశ్వరరావు, అవ్వా విజయభాస్కర్‌లను జగ్గయ్యపేట, చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరెస్టుచేసి పిటి వారెంట్‌పై ఏప్రిల్‌ 2న తీసుకొచ్చారు. అయితే సిఐడి అధికారులు 60 రోజుల్లోగా ఛార్జిషీట్‌ వేయవలసి ఉండగా ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తి పైఐదుగురికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు అగ్రిగోల్డ్‌కు సంబం ధించి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిఐడి అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడం పట్ల అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది పోలీసుల వైఫల్యమేనని మండిపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*