తమ్ముడికి వత్తాసు…. సీఎం కొడుక్కి క్లాస్

akhilesh-mulayam-yadav-shout-at-each-other-at-party-meet

తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఇప్పుడు 70 ఎంఎం సినిమాను హెచ్ డీ టెక్నాలజీలో చూస్తున్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో రేగిన ముసలం ఇప్పట్లో సద్దుమణిగేటట్టు కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ములాయం సింగ్ యాదవ్, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య సయోధ్య కుదరలేదు. సోమవారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశం గందరగోళం మధ్య అసంపూర్తిగా ముగిసింది. సొంత కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కాదని తమ్ముడు శివపాల్ యాదవ్, మిత్రుడు అమర్ సింగ్ కే ములాయం సింగ్ యాదవ్ తన మద్దతు ప్రకటించారు. తన సోదర సమానుడైన తన ప్రియ మిత్రుడు అమర్ సింగ్ ను వదులుకోబోనని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నోసార్లు తనకు అమర్ సింగ్ అండగా నిలిచారని ములాయం సింగ్ యాదవ్ గుర్తు చేశారు. సమాజ్ వాదీ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ ను కూడా తాను దూరం చూసుకోబోనని ములాయం సింగ్ యాదవ్ పార్టీ వేదికగా ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*