‘మొఘల్‌’గా రాబోతున్న అక్షయ్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాలు ఉన్నాయి. తాజాగా ‘మొఘల్‌’ అనే మరో బయోపిక్‌కి సంతకం చేశారు. ఈ చిత్రంలో అక్షయ్‌ టీ-సిరీస్‌ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు గుల్షన్‌ కుమార్‌ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాని గుల్షన్‌ భార్య సుదేశ్‌ కుమారి నిర్మిస్తుండగా సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తారు. బాలీవుడ్‌లో అక్షయ్‌, గుల్షన్‌ మధ్య మంచి రిలేషన్‌ ఉండేది. ఈ బయోపిక్‌ గురించి అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘గుల్షన్‌జీ నాకు పరిచయమవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి చిత్రం ‘సౌగంధ్‌’తోనే గుల్షన్‌ నాకు పరిచయమయ్యారు. ఆయన పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపాడు. 2017 చివర్లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకాబోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*