ఆల్మట్టిలోకి భారీగా వరదనీరు

కృష్ణ నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువున మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో మంగళవారం ఆల్మట్టిలోకి 52897 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి డ్యామ్‌ నీటి మట్టం 129.72 టిఎంసిలు ప్రస్తుతం 57.73 టిఎంసిలకు చేరింది. ఆల్మట్టి నిండిన తరువాత నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల్లో నీరు వచ్చే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యామ్‌లోకి కూడా భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుంది. డ్యామ్‌ పూర్తిసామర్థ్యం 100 టిఎంసిలకు గాను ప్రస్తుతం 46.16 టిఎంసిలు ఉంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 38052 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీకి రెండు వేల క్యూసెక్కుల నీరు చేరింది. జలవనరుల శాఖ అధికారులు పట్టిసీమ ద్వారా వస్తున్న నీటితో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని సైతం కాలువలకు విడుదల చేస్తున్నారు. కాలువల్లో నీటి పరిమాణాన్ని ఎనిమిదివేల క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముందస్తుగానే అధిక విస్తీర్ణంలో వరి సాగుకు అవకాశం ఏర్పడుతుందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*