ఏపీ కోసం గళమెత్తుతున్నా : వెంకయ్య

am-not-elected-from-ap-but-am-fighting-state-says-venkaiah

సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మరోసారి మోడీ దమ్మేంటో రుజువైందన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. ఏపీ ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ.. ఉద్దేశపూర్వకంగా బీజేపీకి ఎవరిపై కక్ష గట్టే అవసరం లేదన్నారు. శనివారం నాడు తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో సన్మానం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, కాంగ్రెస్ వైఫల్యం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందన్న వెంకయ్య.. ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ లోటు భర్తీకి ఎన్డీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి హోదాతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఆ స్థాయిలోనే ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజనను సహేతుకంగా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఏపీని గాలికొదిలేసిన కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్ప‌ద‌ం అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*