అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన

రాజధానిలో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ప్రపంచబ్యాంకు రుణ సాయం అందించనుంది. ఈ నేపథ్యంలో తామిచ్చే రుణం ద్వారా చేపట్టనున్న రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులను బ్యాంకు ప్రతినిధులు పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం రూ.3,400 కోట్ల రుణం మంజూరు చేయాలంటూ ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు మూడేళ్ల క్రితమే కోరారు.సీఆర్‌డీఏ అధికారులు కూడా అమెరికా వెళ్లి బ్యాంకు ప్రతినిధులను కలిశారు. రుణ విడుదలకు మార్గం సుగమం అవుతున్న తరుణంలో రాజధానిలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ కొందరు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దీంతో రుణ మంజూరీని నిలుపుదల చేసిన బ్యాంకు, రాజధాని వచ్చి మరోమారు ప్రాజెక్టులను పరిశీలించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు తామిచ్చే రుణంతో చేపట్టబోయే ప్రాజెక్టులను పరిశీలించనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*