యురీ దాడి.. సీమాంత‌ర ఉగ్ర‌వాద‌మే : అమెరికా

america-calls-uri-attack-a-case-of-cross-border-terrorism

యురీ ఘ‌ట‌న త‌ర్వాత భార‌త్ చేప‌ట్టిన ఆత్మ‌ర‌క్ష‌ణ దాడుల‌ను అమెరికా స‌మ‌ర్థించింది. యురీ ఘ‌ట‌న ఓ సీమాంత‌ర ఉగ్ర‌వాద‌మ‌ని అగ్ర‌దేశం త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. భార‌త్ ఏ దేశంతోనైనా ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డాన్ని అమెరికా స్వాగ‌తించింది. ఇటీవ‌ల భార‌త ఆర్మీ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల‌ను వైట్‌హౌజ్ స‌మ‌ర్థిస్తూనే, పొరుగు దేశాలు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ సూచించింది. అణ్వాయుధాల స‌ర‌ఫ‌రా గ్రూప్‌లో భార‌త్‌ను క‌లుపుకునేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు అమెరికా స్ప‌ష్టం చేసింది. భార‌త్, అమెరికా మ‌ధ్య సంబంధం అత్యంత ప్ర‌గ‌తిశీలంగా ఉంద‌ని వైట్‌హౌజ్ ప్ర‌తినిధి పీట‌ర్ ల‌వోయ్ తెలిపారు. రెండు అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశాల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. యురీ ఘ‌ట‌న సీమాంత‌ర ఉగ్ర‌వాద‌మ‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని, ఆ ఉగ్ర‌వాద చ‌ర్య‌ను ఖండిస్తున్నాం, అదో ఘోర‌మైన‌ దాడి, ప్ర‌తి దేశానికి ఆత్మ‌ర‌క్ష‌ణతో వ్య‌వ‌హ‌రించే హ‌క్కు ఉంటుంది., భారీ ఆయుధాల‌తో యుద్ధానికి దిగ‌డం స‌రికాదని, రెండు దేశాలు స‌హ‌నాన్ని పాటించాల‌ని వైట్‌హౌజ్ ప్ర‌తినిధి అన్నారు. ఇటీవ‌ల పాకిస్థాన్‌కు చెందిన దౌత్య‌వేత్త‌లు క‌శ్మీర్ అంశంపై ల‌వ్‌య్‌తో మాట్లాడారు. ఆఫ్ఘ‌నిస్తాన్ అంశాన్ని క‌శ్మీర్‌తో పోల్చ‌డాన్ని అమెరికా వ్య‌తిరేకించింది. ఈ ఏడాది లోపే భార‌త్‌కు ఎన్ఎస్‌జీలో స‌భ్య‌త్వం వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*