కోహ్లికి అమితాబ్‌ సపోర్ట్‌

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌విరాట్‌ కోహ్లీని లక్ష్యంగా చేసుకుంటూ ఆస్ట్రేలియా మీడియా దాడి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు తమ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు తిరిగొస్తుండగా కోహ్లి బాటిల్‌ విసిరాడని, పీక తెగిపోద్దన్నట్లు సంజ్ఞలు చేశాడని గాలి ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా మీడియా.. తాజాగా విరాట్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చింది. ‘కోహ్లి.. క్రీడా ప్రపంచపు డొనాల్డ్‌ ట్రంప్‌గా మారిపోయాడు.’ అని ఆస్ట్రేలియా పత్రిక ‘ద డెయిలీ టెలీగ్రాఫ్‌’ రాసుకొచ్చింది. అయితే ఈ విషయంలో విరాట్‌కి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అండగా నిలిచారు. ఆస్ట్రేలియా మీడియా చేసిన కామెంట్స్‌పై బిగ్‌బీ స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా విరాట్‌ని డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చింది. థాంక్యూ ఆస్ట్రేలియా మొత్తానికి విరాట్‌ని విన్నర్‌గా, ప్రెసిడెంట్‌గా ఒప్పుకున్నారు’ అని దీటుగా సమాధానమిచ్చారు ‘సర్కార్‌’.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*