విరాట్‌కు అమితాబ్, క్లార్క్ బాసట

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మీడియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చడాన్ని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా తప్పుబట్టాడు. ముగ్గురు విలేకరులు మాత్రమే విరాట్ పై బురద జల్లుడు కార్యక్రమం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పట్లో ట్రంప్ మొ హంలో కోడిగుడ్డును పెట్టి అతన్ని ప్రతిష్ఠను మసకబార్చేలా ప్రయత్నించిన మీడియా ఇప్పుడు కోహ్లీని సైతం ఇలాగే చేయడం దారుణమని విమర్శించాడు. కోహ్లీ మాత్రమే తప్పు చేయలేదని, ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ సైతం విపరీత ప్రవర్తనతో రోత పుట్టించిన విషయాన్ని మీడియా ఎందుకు వెల్లడి చేయడం లేదని ప్ర శ్నించాడు. వీళ్ల విమర్శలను కోహ్లీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇద్దరు కెప్టెన్లు వివాదాన్ని పక్కనబెట్టి ధర్మశాల టెస్టులో విజయంపై దృష్టి పెట్టాలని క్లార్క్ సూచించాడు. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా బయట మంచి స్నేహితులుగా మెలగాలన్నాడు. కోహ్లీ అంటే తనకెం తో ఇష్టమని, అతని ఆటతీరు ఆస్ట్రేలియన్ క్రికెటర్ తరహాలో ఉంటుందని క్లార్క్ ప్రశంసించా డు.

అందుకే ఆస్ట్రేలియా ప్రజలు సైతం విరా ట్‌ను కోహ్లీని విజేతతో పోల్చినందుకు ధన్యవాదాలు
విరాట్ కోహ్లీపై ఆసీస్ మీడియా దాడి చేస్తున్న విషయంలో అతనికి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ మద్దతుగా నిలిచారు. విరాట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చిన ఆసీస్ మీడియాకు అమితాబ్ ట్విట్టర్ ద్వారా చురకలంటించారు. ఆసీస్ మీడియా కోహ్లీని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో పోలిక తెచ్చింది. అంటే.. మీరు కోహ్లీని విజేతగా, ప్రెసిడెంట్‌గా ఒప్పుకున్నారు. ఇందుకు ఆ మీడి యాకు ధన్యవాదాలు అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*