చలో విజయవాడ

అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న చలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.హైమావతి, సుజాతమ్మ తెలిపారు. నెల్లూరు సిఐటియు కార్యాలయంలో శుక్రవారం వారు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తల్లి, బిడ్డ సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఐసిడిఎస్‌ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో నిధులు తగ్గించడం అన్యాయమని విమర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక ఏళ్లుగా సేవలందిస్తున్నా వారికి ఇప్పటికీ కనీస వేతనం రూ.18వేలు అమలు జరపడం లేదన్నారు. వారికి రూ.3వేలు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యకర్తలకు పెండింగ్‌ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఫీడింగ్‌, పిల్లలకు సాయంత్రం అల్పాహార విందు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ హెల్పర్లకు అన్న అమృత హస్తానికి ఇస్తామన్న రూ.250లను వెంటనే చెల్లించాలని కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*