ఔటర్లో ఢీకొట్టిన కారు, అమ్మాయి బ్రెయిన్ డెడ్

another-girl-brain-dead-orr-accident

భాగ్యనగరంలో రమ్య తరహా ప్రమాదం మరొకటి జరిగింది. పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగు రోడ్డులో బస్సు కోసం తల్లీకూతుళ్లు నిరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వారిని గుద్దారు. దీంతో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. బాధితురాలైన అమ్మాయి పేరు సంజన. ఆమె తల్లి శ్రీదేవి. వీరు బస్సు కోసం ఔటర్ రింగు రోడ్డులో నిలబడగా.. కారు వచ్చి గుద్దింది. దీంతో సంజన బ్రెయిన్ డెడ్ అయింది. శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*