విమర్శలతో మాటల ధాటి పెంచిన చంద్రబాబు..

బీజేపీతో కుమ్మక్కై టీడీపీపై, తనపై, తన కుమారుడిపై నిరాధార ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి తాను పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని పవన్ చెప్పారని, ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ వరప్రసాద్ కూడా ఒప్పుకున్నారని ఈ ఉదయం తనను కలిసిన నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ…. ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితులు ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని, దీని ద్వారా ఎపికి ఏం సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఏవైనా విషయాలు ముందుగా మిత్రపక్షాలకు తెలుస్తాయా? అలాంటిది కేంద్రంలో అన్ని అంశాలు వైసిపికే ముందెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. రాజీనామాలపై సభలో ప్రకటనలు చేయడానికి కేంద్రమంత్రులకు అవకాశం ఇవ్వరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రధాన నిందితులు మాత్రం పదేపదే కలుస్తారని, నీరవ్ మోడీ వంటి నిందితులు దేశం దాటిపోతున్నారని, విజయసాయిరెడ్డి వంటి వాళ్లు పిఎంఒలో తిరుగుతున్నారని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*