నీరు – ప్రగతి ‘ పై సిఎం టెలికాన్ఫరెన్స్‌

సోమవారం ‘ నీరు – ప్రగతి ‘ పై అధికారులతో సిఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా స్వయం కృషితో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా వ్యవసాయం అనుబంధ రంగాలలో దిగుబడులు తగ్గకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా ఉపాధి హామీ లక్ష్యాల్ని చేరుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం ఉండకూడదన్నారు. వేసవిలో వడగాలులు, అకాల వర్షాలు వంటి విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్‌, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. సూక్ష్మ సేద్యం నిర్దేశిత లక్ష్యంలో 70 శాతం మాత్రమే పూర్తయ్యిందని, మిగిలిన 30 శాతమైన లక్షా 40 వేల ఎకరాల్లో కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఉద్యాన రంగం నుంచి 25 శాతం ఆదాయం వచ్చే దిశగా ముమ్మరం చేయాలన్నారు. జీబా వినియోగంపై రైతుల్ని చైతన్య పరచాలన్నారు. జీబా వినియోగానికి ఎకరానికి రూ.2,500 ఖర్చవుతుం దన్నారు. దీనివల్ల నాలుగైదు రోజులపాటు నీటి తడి భూమిలో ఇంకకుండా సమర్ధ నీటి నిర్వహణకు అవకాశముంటుందన్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో జీబా వినియోగం ద్వారా కరువును అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*