వెలగపూడిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం

ap-govt-operations-starts-from-today-in-velagapudi-interim-secretariat

ఎట్టేకలకు వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వివిధ శాఖలకు చెందిన సుమారు వెయ్యి మంది ఉద్యోగులు సోమవారం విధుల్లోకి చేరారు. ప్రస్తుతానికి ఫైనాన్స్, మున్సిపల్, రవాణాశాఖకు చెందిన ఉద్యోగులు మాత్రమే అమరావతికి తరలివెళ్లారు. నిర్మాణ ప్రక్రియ పూర్తికాగానే మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా వెలగపూడి సచివాలయానికి తరలివెళ్తారు…ఉదయం ప్రత్యేక రైల్లో విజయవాడకు చేరుకున్న ఉద్యోగులు .. అక్కడి నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి చేరుకొని విధుల్లో చేరారు. అక్టోబర్ నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగులు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*