ఆగస్టు 9న ఆర్టీసి ఎన్నికలు

ఆర్టీసిలోని అన్ని కార్మిక సంఘాల నాయకులతో కార్మిక శాఖ కమిషనర్‌ సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారని, ఆగస్టు 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ చేపడతారని తెలిపారు. ఈనెల 20 నాటికి కార్మిక సంఘాలకు
ఓటర్ల జాబితాలు అందజేస్తారని, వీటిలో అభ్యంతరాలుంటే 23లోపు కార్మిక శాఖ అదనపు కమిషనర్‌కు తెలియజేయాలని వివరించారు. తెలంగాణలో పనిచేస్తున్న డిప్యుటేషన్‌ ఉద్యోగులు ఎపిలో వారి సొంత డిపోలో ఓట్లు వేయాలని, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎపి ఉద్యోగులకు హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో బ్యాలెట్‌ బాక్సును ఏర్పాటు చేస్తారని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*