అవన్నీ వదంతులే..

న్యూఢిల్లీ : దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను బ్యాంక్ ఖండించింది. శిఖా శర్మ రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నదని, ఇది అసత్యమని, పెట్టుబడిదారులు, బ్యాంక్ ఖాతాదారులు ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దని బ్యాంక్ స్టాక్ మార్కెట్‌కు తెలియచేసింది. నోట్ల రద్దు తర్వాత యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన పలు శాఖలపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ ఆర్థిక ఫలితాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనడంతో ఆమె బ్యాంక్‌ను వీడుతున్నట్లు గడిచిన కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

వీటితోపాటు కొటక్ మహీంద్రా బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్‌ను విలీనం చేయనున్నట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల్లో బ్యాంక్ నికర లాభం 73 శాతం క్షీణించి రూ.580 కోట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర 2 శాతానికి పైగా క్షీణించి రూ.490 వద్ద స్థిరపడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*