‘గాలి కూతురు పెళ్లి ఆర్భాటంగా కాదు! సింపుల్ గానేనట’

b-sriramulu-on-gali-daughter-marriage

మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. ఏకంగా శుభలేఖల్లోనే ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టించడంతో గాలి కూతురు పెళ్లి ఇంకేంత ఘనంగా జరుగుతోందని అందరూ అనుకున్నారు. అయితే, ఈ వార్తలను గాలి ప్రధాన అనుచరుడు, బళ్లారి ఎంపీ బి శ్రీరాములు ఖండించారు. గాలి కూతురు వెడ్డింగ్ కార్డు రూపకర్త ఎవరో తెలుసా? జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి తనకు కూడా కూతురు లాంటిదే అని ఆయన తెలిపారు. పెళ్లి ఖర్చుకు సంబంధించి అనేక ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయని.. వాస్తవానికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమ స్థాయికి తగ్గట్టు మధ్య తరగతి స్థాయిలోనే వివాహం జరుగుతుందని ఆయన వివరించారు. వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశామని తెలిపారు. ఈ పెళ్లికి జాతీయ నేతలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బళ్లారిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కాగా, కూతురు పెళ్లి నేపథ్యంలో జనార్దన్ రెడ్డి నవంబర్ 1న బళ్లారి రానున్నారు. 10న పెళ్లి కూతురును చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే జరుగుతాయి. వివాహం అక్టోబర్ 16న ఘనంగా జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*