‘మీ నాడి వేగం పెరుగుతుంది.. ఊపిరి ఆగిపోతుంది’

జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో అంచనాలను పెంచేసిన బాహుబలి టీం.. ట్రైలర్‌తో మరోసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. గురువారం రిలీజ్ అయిన బాహుబలి 2 ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

పలువురు టాలీవుడ్ స్టార్స్ ట్విట్టర్ ద్వారా తమ అనుభూతిని పంచుకున్నారు. రాజమౌళితో హ్యట్రిక్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ ‘గతంలో ఎప్పుడు తెలియని అనుభవం. మీ నాడి వేగం పెరుగుతుంది. ఊపిరి ఆగిపోతుంది. కన్ను రెప్ప కూడా వేయలేరు. కుద్దూస్ జక్కన్న’ అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ ‘రోమాలు నిక్కబొడుచుకోవటం గ్యారెంటీ. బాహుబలి 2 ట్రైలర్ అవుట్ స్టాండింగ్. ప్రభాస్, రానా, రాజమౌళి గారికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు.

మరో హీరో అల్లరి నరేష్ కూడా బాహుబలి ట్రైలర్‌పై స్పందించాడు.’ఇది నిజంగా అద్భుతం, రాజమౌళి, శోభు, ప్రభాస్, రానా, ఆర్కా మీడియా వర్క్ ఇతర యూనిట్ సభ్యులకు హ్యాట్స్ ఆఫ్’ అని ట్వీట్ చేశాడు. గాయని స్మిత ఓ ఆంగ్ల సామెతతోబాహుబలి ట్రైలర్ తెలుగు సినీ ప్రముఖుల గౌరవాన్ని పెంచే, ఇతర సినీరంగాల వారు అసూయ చెందే అద్భుతం అంటూ ట్వీట్ చేసింది. హీరోయిన్ సమంత, హీరోలు రామ్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ లాంటి ఇతర సినీ ప్రముఖులు బాహుబలి ట్రైలర్ పై స్పందించారు. బాహుబలి సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*