ఆ అమ్మాయి 16ఏళ్లకే విమానం నడిపేస్తోంది!

baroda-girl-aims-the-sky-gets-flying-licence

16ఏళ్ల వయస్సులో ఎవరైనా ద్విచక్ర వాహనమో, నాలుగు చక్రాల వాహనం డ్రైవింగ్ నేర్చుకుంటే గొప్పగా భావిస్తాం. అయితే ఓ అమ్మాయి మాత్రం ఏకంగా విమానాన్నే నడిపేస్తుండటం విశేషం. ఆమే గుజరాత్ రాష్ట్రంలోని బరోడా నగరానికి చెందిన వారిజా షా. వారిజా షా 20 నిమిషాల పాటు సెస్నా విమానాన్ని నడిపి అత్యంత చిన్న వయసులోనే స్టూడెంట్ పైలెట్ లైసెన్సు సాధించి రికార్డు సృష్టించింది. సెస్నావిమానంలో గాలిలో చక్కర్లు కొడుతూ అహ్మదాబాద్ నగరాన్ని చూడటం మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చిందని వారిజా చెప్పింది. శిక్షకుడు ఇస్తున్నసూచనలు పాటిస్తూ వేగంగా విమానం నడపడం తనకు జన్మదిన బహుమతిగా చెప్పుకొచ్చింది. ‘పైలెట్ కావాలనే కోరికతో నేను ఏడో తరగతి చదువుతున్నపుడు తల్లిదండ్రుల సహకారంతో గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరాను. విమానం నడపడంపై గ్రౌండుతోపాటు థీరీ తరగతుల్లో శిక్షణ పొందానని, భవిష్యత్‌లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ కావాలనేది నా కోరిక’ అని తెలిపింది. వారిజా ప్రతిభ గల విద్యార్థిని అని ఆమె విమానాలు నడపడంలో ప్రావీణ్యం సంపాదిస్తుందని గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్ చీఫ్ ఫ్లైట్ శిక్షకుడు ఛార్లీ వేయిర్ తెలిపారు. వారిజా విమానం నడపటమే కాదు, టెన్నిస్ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంటుందని వారిజాషా తల్లిదండ్రులు ప్రశాంత్, పూర్వీమోదిషా చెప్పారు. తనకు టెన్నిస్ ఆడాలని, పైలెట్ కావాలని ఉండేదని, తన కోరికను తన కూతురు తీరుస్తుందని వారిజా తల్లి చెప్పుకొచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*