బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది!

bermuda-triangle-mystery-solved.cms.jpg

పెద్ద పెద్ద నౌకలతోపాటు, భారీ విమానాలను సైతం సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 లక్షల చ.కి.మీ. మేర విస్తరించిన ఈ ప్రాంతంలోకి ఓడలు వెళ్లగానే వాటి జాడ తెలియకుండా పోయేది. ఆ ప్రాంతం మీదుగా ఎగిరే విమానాలు కూడా మాయవడం ఎన్నో ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా మిలిగిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు ఈ మిస్టరీ వీడింది. నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి కారణాలను శాస్త్రవేత్తలు వివరించారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చారు. 20 నుంచి 50 మైళ్ల విస్తీర్ణంతో, గంటకు 170 మైళ్ల వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ తరహాలో విరుచుకుపడటంతో నౌకలు, విమానాలు గింగిరాలు కొడుతూ మాయమైపోతున్నాయి. శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్టు వాతావరణ పరిశోధకులు తెలిపారు. ఈ మేఘాల నుంచి ఏర్పడే ఎయిర్ బాంబులు చాలా శక్తివంతమైనవని తేల్చారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి షడ్బుజాకార మేఘాలు ఏర్పడతాయని వారు తెలిపారు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఇలా ఇప్పటి వరకూ కనీసం 75 విమానాలు, వందలాది నౌకలు అదృశ్యమయ్యాయి. దీంతో గత వందేళ్లలో కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*