కెప్టెన్‌కు పంజాబ్‌ ‘బర్త్‌డే గిఫ్ట్‌’

ఛండీఘర్‌: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ఆ రాష్ట్ర ప్రజలు పుట్టినరోజు బహుమతిని అందించనున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ గెలుపు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. శనివారం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ 75వ పుట్టినరోజు. దీంతో ప్రజలు ఆయనకు బర్త్‌డే గిఫ్ట్‌గా అధికారం కట్టబెట్టనున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లంబి, పాటియాలా స్థానాల నుంచి అమరీందర్‌ పోటీ చేశారు. లంబిలో ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌పై ఆయన వెనుకంజలో ఉండగా.. పాటియాలాలో ముందంజలో ఉన్నారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్‌ 75, అకాలీదళ్‌-భాజపా కూటమి 18, ఆప్‌ 20, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*