దూసుకు వచ్చిన పాక్ బోట్

bsf-seize-pakistani-boat-from-river-ravi-near-pathankot-panj

పాకిస్థాన్ నుంచి పాక్ బోట్ భారత్ జాలాల్లోకి దూసుకురావడంతో కలకలం రేగింది. గతంలో ఉగ్రదాడి జరిగిన పాఠాన్ కోట్ సమీపంలోకి పాకిస్థాన్ కు చెందిన ఓ బోట్ దూసుకు వచ్చింది. ఉగ్రదాడి చెయ్యడానికి ఉగ్రవాదులు వస్తున్నారని అనుమానంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే రావి నదిలో పాక్ బోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పఠాన్ కోట్ సెక్టార్ లోని రావి నది ప్రవాహానికి పాక్ బోట్ కొట్టుకు వచ్చిందని అధికారులు అన్నారు. అయితే పాక్ బోట్ ఖాళీగా ఉందని, అందులో ఏమి లేదని అధికారులు అంటున్నారు. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఖాళీ బోట్ కొట్టుకువచ్చిందని అధికారులు అన్నారు. ఈనెల 2వ తేదిన గుజరాత్ తీరంలో పాక్ కు చెందిన ఓ బోటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ బోట్ లో ఉన్న తొమ్మిది మందిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది మంది మత్య్సకారులని అధికారులు గుర్తించారు. భారత్ సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ దాడులు చేసిన తరువాత పాక్ నుంచి పావురాలు, బెలూన్లు, బోట్లు భారత్ భూభాగం, భారత జాల్లలోకి వస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*