భల్లాల దేవుడికి కేసు తిప్పలు!

case-filed-on-rana-daggubati-and-prakashraj

దగ్గుబాటి రానా ‘బాహుబలి’ సినిమాలో కనిపించినంత వయిలంట్ గా బయట ఉండడు. రానా చాలా సరదాగా అందరితో కలిసిపోతాడు. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చాననే గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు. అలాంటి రానా ఇప్పుడు ఓ కోర్టు కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.కోయంబత్తూర్ కు చెందిన ఓ సామాజిక వేత్త రానా, ప్రకాష్ రాజ్ ల మీద కమీషనర్ కు కంప్లైంట్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్లు రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారని పి.ఇళగోవన్ అనే సోషల్ యాక్టవిస్ట్ ఫిర్యాదులో వివరించారు.వెబ్ సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేస్తున్నారని ఆ యాడ్స్ టీవీలో ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరు ఈ విధంగా ప్రచారం చేయడం వలన మిగిలిన వెబ్ పోర్టల్స్ కూడా బెట్టింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నాయని కోయంబత్తూర్ కమీషనర్ కు ఇచ్చిన పిర్యాదులో వివరించారు. నిజానికి బెట్టింగ్, రమ్మీ వంటి వాటిపై నిషేధం ఉండడంతో ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న భల్లాలదేవుడికి విచారణలో వ్యతిరేకంగా రిపోర్ట్‌ వస్తే గనుక తిప్పలు తప్పేలే కనిపించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*