అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం

అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ముంబై, బెంగళూరుకు నిధులిచ్చి ఏపీకి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్థికంగా బలంగా వున్న బెంగళూరు ‘మెట్రో’కు రూ.17 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా  ఆయన ప్రస్తావించారు.  ఏపీ రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తుందని, పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలన్నది తన కలని చంద్రబాబు అన్నారు.నేను చెప్పేది సామాన్యుడు సైతం అర్థం చేసుకుంటున్నారు కానీ, బీజేపీ నేతలు మాత్రం అర్థం చేసుకోవట్లేదు’ అంటూ బీజేపీ నేతలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అరవై ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న సొత్తును అన్యాయంగా కోల్పోతే మీకు, బాధకలగదా?’ అని విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని అంశాలు, అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తీర్మానంలో పేర్కొన్న అంశాలు..

  • రాజ‌ధాని నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయాలి
  • రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి
  • ఉక్కు క‌ర్మాగారం స్థాపించాలి
  • ఓడరేవు రావాలి
  • పెట్రో కెమిక‌ల్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు కావాలి
  • నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెర‌గాలి
  • విద్య, ప‌రిశోధ‌న సంస్థ‌లు ప్రారంభించాలి
  • ఉమ్మ‌డి రాష్ట్రంలోని సంస్థల విభ‌జ‌న పూర్తి కావాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*