పవన్‌ను బీజేపీ నడిపిస్తోంది

సీఎం చంద్రబాబు  పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహం, పవన్ వ్యాఖ్యలపై చర్చించారు.ఏపీ సమస్యలు, హోదా వంటి అంశాలను పక్కనపెట్టి పవన్ కల్యాణ్.. టీడీపీని టార్గెట్ చేసేలా మాట్లాడటం వెనకున్న ఆంతర్యమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ వెనకుండి పవన్‌ను నడిపిస్తోందని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్న చంద్రబాబు.. ఈ రోజు కాకున్నారేపైనా అందరి వ్యవహారాలు బయటికొస్తాయని చెప్పారు. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా.. ప్రజాభిప్రాయం ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేసిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా నుంచి ఫోకస్ పోకూడదని నేతలను ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*