నా జీవితంలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొన్నా

ఎన్టీఆర్‌ నాకు దేవుడు…తల్లిదండ్రుల కంటే ఆయననే గొప్పగా గుర్తుపెట్టుకుంటాను. ఎన్టీఆర్‌ నుంచి ఎంతో చేర్చుకున్నా…దేనికీ భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేసే చొరవ ఆయన నుంచే నేర్చుకున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సేవ చేయడానికి ఇతరులెవరికీ దక్కని అద్భుతమైన అవకాశం తనకు దక్కిందన్నారు. ”ఇదో అరుదైన అనుభవం. అరుదైన అనుభూతి. రాజకీయ నాయకుడిగా కాదు….ప్రజా సేవకుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటే చాలా సంతృప్తి కలుగుతోంది” అని అన్నారు. సభ్యులు తమ అనుభవాలు చెబుతుంటే పాత జ్ఞాపకాలన్నీ కళ్లముందు కనిపిస్తున్నా యన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుటుంబం కంటే కార్యకర్తలతోనే ఎక్కువగా గడిపానన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో భార్య భవనేశ్వరి సహకారం కూడా మరువలేనిదన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గానీ, తాను సీఎంగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి కూతు రిగా, భార్యగా ఏనాడూ ఆలోచించలేదన్నారు. ఎప్పుడూ సామాన్య మహిళలు ఆలోచించినట్లుగానే ఆలోచించేద న్నారు. అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*