ఇది శాఖాపరమైన వైఫల్యం

గుంటూరులో కలుషిత నీటి వల్ల 10 మంది దుర్మరణం చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి వైఫల్యం వల్ల 10 మంది చనిపోయారని అన్నారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దాన్ని చక్కదిద్దేంత వరకు విశ్రమించరాదని చెప్పారు. విశాఖను హుదూద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు… మనమంతా ఎలా చేశామని… గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. అధికారుల పనితీరు ప్రభుత్వ గౌరవాన్ని పెంచేలా ఉండాలని చెప్పారు. అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించబోనని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*