టిటిపి సమన్వయ కమిటీ సమావేశం

ఉండవల్లిలోని సిఎం నివాస గృహంలోని గ్రీవెన్స్‌హాల్‌లో తెలుగుదేశంపార్టీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటైంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో పార్టీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు అందులో ధర్మ పోరాట దీక్షలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. గ్రామదర్శిని పేరుతో నేతందరూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటనలు చేయాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో బాటు నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు వ్యక్తిత్వంపై దాడి చేస్తున్న విపక్షాలను సమర్థంగా తిప్పికొట్టేం దుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు నేతలు వెల్లడించారునాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పధకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేయాలని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సూచించినట్లు తెలి సింది. బిసి, గిరిజన చైతన్య సభలు పెట్టడం ద్వారా ఆయా వర్గాల్లో పట్టు సాధించవచ్చని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. బూత్‌ స్ధాయిల్లో పార్టీని పటిష్టపరచాల్సిన బాధ్యత గ్రామస్ధాయి నాయకులదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. బూత్‌ కమిటీలు, సేవా మిత్రలు లేని చోట్ల త్వరిత గతిన నియమించాలని నేతలను ఆయన కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*