నేడు గ్రామదర్శినికి శ్రీకారం

గ్రామ దర్శిని కార్యక్రమానికి సిఎం చంద్రబాబు సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు. గ్రామదర్శిని కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. నెలకు మూడు నుంచి నాలుగు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలకు వివరించడం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం, మొక్కలు నాటడం తదితర పనుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లేందుకు సిఎంతో పాటు టిడిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*