గల్లా ప్రసంగంపై చంద్రబాబు ప్రశంసలు

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని దేశ ప్రజల ముందు ఎంపీ గల్లా జయదేవ్ సమగ్రంగా ఆవిష్కరించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కేంద్ర వైఖరిపై రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే తాము అవిశ్వాసం పెట్టామని చెప్పారు. దీనికి 126 మంది సభ్యులు మద్దతు తెలిపారని అన్నారు. దీనిపై మోడీ మాట్లాడుతూ అత్యంత చులకనగా దిగజారిపోయి మాట్లాడా రని అన్నారు. ఏపీకి న్యాయం చేస్తారని ఎన్డీయేలో చేరితే, బీజేపీ మాత్రం తమకు అబద్ధపు హామీలు ఇస్తూ వచ్చిందని వరుస ట్వీట్లలో ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వమైనా ఏపీకి మేలు చేస్తుందన్న నమ్మకంతో 2014లో తాము ఎన్డీఏలో చేరామని, తమకు న్యాయం చేయాలని అభ్యర్థించామని, ఇన్ని రోజులు వేచి చూశామని, సీఎం చంద్రబాబు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ప్రతిఒక్కరూ పాల్గొంటారని, ఏపీకి న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అని లోకేశ్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*