నిరసనలను కొనసాగించండి చంద్రబాబు దిశానిర్దేశం

టీడీపీ సభ్యులు చేస్తున్న నిరసనలను కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎంపీలు ఎవరకూ నిశబ్ధంగా కూర్చోవద్దని, కలసికట్టుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలిపేలా నిరసనలు చేపట్టాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రావాల్సిన నిధుల వివరాలతో పాటు యూసీలు, డీపీఆర్ లన్నీ ఆన్ లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని ఎంపీలు వాడుకోవాలని అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా ఫర్వాలేదని, బయటకు వచ్చి మరింత ఉద్ధృతంగా పోరావడాలని అన్నారు. ఏ పార్లమెంట్ లో అయితే ఏపీకి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్ లో రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*