నారా లోకేష్‌కు చంద్రబాబు క్లాస్

chandrababu-takes-class-to-nara-lokesh-why

తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నాడనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్లాస్ తీసుకనేంత తప్పులో నారా లోకేష్ ఏం కాలేశాడనేది ఆందరికీ ఆసక్తికరమైన విషయమే. హైదరాబాదులో ఉంటూ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులో లేకపోవడంపై చంద్రబాబు నారా లోకేష్‌కు క్లాస్ తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గుంటూరులో ఉంటూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు తన తనయుడ్ని ఆదేశించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యాలయానికి కూడా ఓసారి వచ్చారు. పార్టీ నేతలు విజయవాడలోని సీఎంవో కార్యాలయానికి వచ్చినా చంద్రబాబు అందుబాటులోకి రావడం లేదు. కొన్నిసార్లు రోజుల తరబడి ఎదురుచూసినా సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి. చివరికి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన తక్కువ సమయమే కేటాయించగలుగుతున్నారు. దాంతో టీడీపీలోని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు కొంత నిరాశకి గురువుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే చంద్రబాబు నారా లోకేష్‌కు క్లాస్ పీకారని అంటున్నారు. మూడు రోజులు గుంటూరులోనూ, నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ లోకేష్ ఉంటున్నారు. అయితే, పూర్తి స్థాయిలో గుంటూరులో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్‌ను ఆదేశించినట్లు చెబుున్నారు. చంద్రబాబు ఆదేశాలను పాటించే పనిలో లోకేష్ పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటున్న లోకేష్ ప్రతిరోజూ గుంటూరు వెళ్లి వస్తున్నారు. క్రమంగా గుంటూరుకే నారా లోకేష్ మకాం మార్చేయవచ్చునని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*