బాంబు పేల్చిన శశికళ

sasi kala chennai
sasi kala chennai

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ”ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు” అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. సుమారు గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని ఆమె తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వాళ్లు కుట్ర పన్నుతున్నారన్నారు. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విషయంలో గానీ, మరేదైనా విషయంలో గానీ జయలలిత నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా సంతకాలు జాగ్రత్తగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*