సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150

chiru-s-khaidi-no-150-hit-the-screens-on-sankranti

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ విడుదలై అభిమానుల మనస్సులను దోచుకున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం కత్తికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు సగం పూర్తయ్యింది. అభిమానులంతా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోందని చాలా రోజులుగా అనుకుంటున్నదే. కానీ అఫీషియలా ఎక్కడా దృవీకరించలేదు. ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్పుడిది అఫీషియల్… ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. చిరంజీవి 150వ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. మొన్నటివరకు గాసిప్ గా ఉన్న ఈ విషయాన్ని నిజం చేశాడు చ‌ర‌ణ్. ఇదివరలోనే వీ.వీ వినాయక్ కూడా ఖైదీ నంబర్-150ను వచ్చే ఏడాది భోగి రోజున.. అంటే జనవరి 13న విడుదల చేయాలని నిర్ణయించారంటూ చెప్పారు కానీ అది మామూలుగా అన్న విషయమే తప్ప అప్పటికి ఇంకా అధికారికంగా చెప్పలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*