సిరిసిల్ల జిల్లాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

cm-kcr-green-signal-siricilla-as-new-district

దసరా సందర్బంగా.. కొత్త జిల్లాల కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, పలు ప్రజా ఉద్యమాలు, ఆందోళనలతో గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లా కేంద్రాల ప్రతిపాదన కూడా తెరపై ఊగిసలాడుతోంది. ఈ నేపథ్యంలో.. పునరాలోచనలో పడ్డ సీఎం కేసీఆర్ కొత్త ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఈ దిశగా ప్రస్తుతం సమాలోచనలు జరుపుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు గ్రీన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*