4జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరా, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర రూ.10,999 మాత్రమే!

coolpad-note-5-first-impressions-the-cheapest-4gb-ram-smartphone

Coolpad Note 5 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ లేటెస్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999. భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ మొదటి ఇంప్రెషన్స్‌ను ఇప్పుడు చూద్దాం.. కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ మీకు మొదటి చూపులోనే ప్రీమియమ్ లుక్ ను కలిగిస్తుంది. షియోమీ రెడ్మీ నోట్ 3 తరహా బ్యాక్ ప్యానల్ తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో కొంచం బల్కీగా అనిపిస్తుంది. మెటల్ బాడీ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్, 2.5డి కర్వుడ్ గ్లాస్‌‌తో కూడిన 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080పిక్సల్స్. ఫోన్ డిస్‌ప్లే నాణ్యమైన టచ్ రెస్సాన్స్‌‍ను ఆఫర్ చేస్తుంది. ఉత్పత్తి చేసే కలర్స్ సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఈ ఫోన్ ద్వారా అవుట్ డోర్ లైటింగ్‌లో వీడియోలను షూట్ చేస్తున్నప్పుడు డిస్‌ప్లే బ్రైట్నెస్ లెవల్స్ కొంచం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్‌ను బీస్ట్ ఆఫ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్యాటగిరిగా కూల్‌ప్యాడ్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇందుకు కారణం 4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ డివైస్ ధర కేవలం రూ.10,999 కావటమే. ఈ ఫోన్, మీ రోజువారి మల్టీమీడియా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*