ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం దారుణం … పి.మధు

హోదా కోసం బంద్‌ చేస్తున్న వైఎస్సార్‌సిపి నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మరో నేత బాబూరావుతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు. ఒక వైపు హోదా కోసం తాము పోరాడుతున్నామంటూ చెబుతున్న చంద్రబాబు, మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం ఏమాత్రం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు అని, దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలోనూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారన్నారు.చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచివేస్తామనుకోవడం అవివేకమన్నారు. అరెస్ట్‌ చేసిన వైఎస్సార్‌సిపి నాయకులను వెంటనే విడుదల చేయాలని మధు డిమాండ్‌ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*