సెంచూరియన్ లో నేటి నుంచి రెండో టెస్ట్

టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ సెంచూరియన్ లో నేడు ప్రారంభం కానుంది.ఈ టెస్టులో మన ఆటగాళ్లు పుంజుకోవడం పెద్ద సవాలే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఒకటే. అత్యున్నత బ్యాట్స్ మెన్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టే పిచ్ ఇక్కడుంది. భారత్ సహా ఇక్కడ ఆడిన జట్లన్నీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన చరిత్ర ఈ పిచ్ కు ఉంది. సో, ఈ మ్యాచ్ భారత్ కు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చు.మ్యాచ్ లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తుది జట్టులో ఏమాత్రం మార్పులు జరిగినా, రోహిత్ కు స్థానం లభించకపోవచ్చు. ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, కీపర్ సాహా స్థానంలో పార్థివ్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కేప్ టౌన్ లో ధావన్ పేలవమైన షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టెక్నికల్ గా మెరుగైన బ్యాట్స్ మెన్ అయిన రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*