అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారము మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో -2 మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో-2 సి.ఐ.జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కి చెందిన సల్మాన్ ఖాన్, నజీమ్ ఖాన్, ఢిల్లీకి చెందిన ఫైజా ఖాన్, రాహుల్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రితికా కుమారి సూర్యబాగ్ ప్రాంతం నుండి డిల్లీకి అక్రమ రవాణ చేస్తున్నారన్న సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు సూచనల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్-2 సి.ఐ. బి.జగదీశ్వరరావు, ఎస్.ఐ. మాధవి, టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ. రామకృష్ణ చౌదరి మరియు సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకొని ఎండు గంజాయిని స్వాదీనం చేసుకొని రిమాండుకు పంపించారు. పరారీలో ఉన్న రాహుల్ ను పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా
