మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో గల ఆర్.కె.బీచ్, కాళీమాత టెంపుల్ ఎదురుగా ఉన్న బీచ్ లో బుధవారం సాయంత్రం యువకుడి మృతదేహం కొట్టుకు వచ్చింది. దీనికి సంబంధించి త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత నగర్ కు చెందిన నౌపాడ లోకేష్ (17) గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజులానే బుధవారం కాలేజ్ కి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్తానని కాలేజ్ నుండి వెళ్ళిపోయాడు. లోకేష్ మృతదేహం బీచ్ కి కొట్టుకు రావడంతో పోలీసులు తలిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో లోకేష్ ను ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లోకేష్ తండ్రి మోహనరావు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
బీచ్ లో యువకుడి మృతదేహం
