విశాఖలో మరో భూ కుంభకోణం

 

– ప్రభుత్వ, క్రిస్టియన్, వివాదాస్పద స్థలాల కబ్జాలతో పాటు మరో భూ కుంభకోణం

– కడపకు చెందిన వైసిపి ఉప ముఖ్యనేత కనుసన్నల్లో…..నే

విశాఖలోని ప్రభుత్వ, క్రిస్టియన్ మైనారిటీ, వివాదాస్పద స్థలాలతో పాటు చివరికి ఏ.యూ, అటవీ శాఖ స్థలాలను కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, ఇది మరో భూ కుంభకోణం అని జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు నుంచి సిరిపురం వెళ్లే మార్గంలో
అటవీశాఖకు చెందిన భూమిపై కడప జిల్లాకు చెందిన వైసిపి ఉప ముఖ్యనేత కన్నుపడిందని తెలిపారు. చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ వనవిహార్ లో బ్లాక్ నెం12 టౌన్ సర్వె నెంబర్ 88 లో ప్రైవేటు ఆస్తిగా చూపించి సర్వే చేస్తున్నారని అన్నారు. సుమారు 3.62 ఎకరాల్లో 350 కోట్లు విలువ చేసే భూమిని కొట్టేస్తున్నారని, ఇది ఏయూ, అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ భూమన్నారు. అయితే ప్రైవేటు ఆస్ధి అని చెప్పి అటవీ శాఖ అనుమతి లేకుండా సర్వే చేయిస్తున్నారని, దీంతో అటవీ శాఖ కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ భూమి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా ఉంటుందన్నారు.
1960లో దాఖలు పడిందని కడప జిల్లాకి చెందిన ఓ ప్రముఖ వైసిపి నేత ఈ ఫారెస్ట్ ల్యాండ్ ను సర్వేచేయించారని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 18 రోజుల్లో
జీవిఎంసి సర్వేయర్ తో సర్వే చేయించారని చెప్పారు. ముఖ్యమంత్రి జిల్లా నుండి వచ్చిన వైసిపి ఉప ముఖ్యనేత ఆదేశాల మేరకు సర్వే చేసి ప్రైవేట్ భూములుగా డిక్లేర్ చేయించి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తప్పుడు డాక్యుమెంట్లతో అటవీ శాఖ, ఏయూ భూములను కబ్జా చేయడానికి కుట్రపన్నారని, ఇప్పటికే దసపల్లా, రుషికొండ, హయగ్రీవ, హౌసింగ్ కార్పొరేషన్ పేరుతో రేడియంట్, సిబిసిఎన్ సి స్థలాలను కాజేస్తున్నారని, ఇది మరో భూ కుంభకోణం అని వెల్లడించారు. ఐఏఎస్ హోదాలో ఉన్న కమిషనర్ రాజబాబు, ప్రభుత్వ భూములను కాపాడాల్సింది
పోయి, వాటి బాగోతాలను బయటపడితే… రిజెండర్ పంపిస్తున్నారన్నారు. భూములు వివాదంలో లేవని కమిషనర్ రిజెండర్ ఇచ్చి ఎలా చెబుతారని, దమ్ముంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ చెప్పగలరా అని నిలదీశారు. యాజమాన్యపు హక్కులపై కోర్టు వివాదంలో వున్నపుడు ఒకే వ్యక్తి పేరు మీద సిబిసిఎన్ సి స్థలం టిడిఆర్ ఎలా ఇస్తారన్నారు. ఈ ఏడాది జనవరి నుండి 11 నెలలుగా ప్లాన్ ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. సిబిసిఎన్సీకి చెందిన 18 మందిలో ఎవ్వరకీ దాఖలు పరుస్తున్నట్లు కోర్టు ఇవ్వలేదని తెలిపారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణలో సిబిసిఎన్ సి స్థలం పోతుందని రూ.63 కోట్ల టిడిఆర్, గజం స్ధలం పోకుండా ఎలా విడుదల చేస్తారని మండిపడ్డారు. 18 సంస్థలకు చెందినట్టు చెబుతూ ఒకే వ్యక్తికి దరఖాస్తు చేసుకున్న 18 రోజుల్లో ఎలా ఇస్తారన్నారు. సోషల్ వెల్ఫేర్ ఆస్ధి ఇక్కడ వుందని సర్వే రిపోర్ట్ జీవీఎంసీ ఇవ్వలేదా అని అడిగారు. ఇందులో సోషల్ వెల్ఫేర్ స్థలం 3600 గజాలు ఉందని, దీనిని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ వైజాగ్ మాజీ చైర్మన్ జీవి కలిసి కాజేస్తుంటే కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా అన్నారు. సి బి సి ఎన్ సి, సోషల్ వెల్ఫేర్ స్థలాల అవినీతి అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు చేస్తే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, కబ్జాదారులకు అండగా నిలబడడం దారుణం అన్నారు. ఇలా అయితే భవిష్యత్తులో వీరంతా జైలు పాలు కావలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల స్థలాల ఆస్తుల పరిరక్షణకు జనసేన పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *