పూరి మ్యాజిక్ పని చేసిందా? ‘ఇజం’ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత?

day-1-ism-reportedly-raked

కళ్యాణ్ రామ్ హీరోగా…. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇజం’ చిత్రం అక్టోబర్ 21న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే పూరి జగన్నాథ్ మూవీ కావడం, కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంటుగా ఉండటంతో తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఇజం’ చిత్రం తొలి రోజు రూ. 2.60 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ వసూళ్లు. నైజాం(తెలంగాణ)లో తొలి రోజు రూ. 1 కోటి వసూలు చేసింది. ఏపీలో తొలిరోజు రూ. 1.60 కోట్లు వసూలు చేసింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ‘ఇజం’ సినిమా తీసారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ జర్నిలిస్టుగా నటించారు. నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*